1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (16:23 IST)

లీడ్ గానే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధం : రాహుల్ విజయ్

Rahul Vijay
Rahul Vijay
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్,  వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2  బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాహుల్ విజయ్ మీడియా మిత్రులతో ఇలా ముచ్చటించారు.
 
‘‘'మంచి కథ కోసం చూస్తున్న సమయంలో గీతా ఆర్ట్స్ నుంచి కాల్ రావడం ఆశ్చర్యపోయాను. గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లే వరకు కూడా నమ్మకం కలగలేదు. నాలాంటి అప్ కమింగ్ యాక్టర్ కి ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తా. *నయట్టు* చిత్రంలో నుంచి పాయింట్ మాత్రమే తీసుకొని మిగతాదంతా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాననే భయంతో ఒరిజినల్ వెర్షన్ మొత్తం చూడలేదు. శ్రీకాకుళంలో ఉన్న  కోటబొమ్మాలి అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందనేది మెయిన్ కాన్సెప్ట్. కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్ గారు కనిపిస్తారు.  
 
దేశంలో ఉన్న  రాజకీయ పరిస్థితులను ఇందులో చూడొచ్చు. బయట జరుగుతుంది మాత్రమే చూపించాము.  తేజ మార్ని క్లారిటీ ఉన్న దర్శకుడు. ప్రతి ఒక్కరి నుంచి ది బెస్ట్ రాబట్టుకున్నారు. స్క్రీన్ ప్లే రేసీగా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఉంటుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. శ్రీకాంత్ గారు అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతారు. మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు సెట్ లో చాలా చిల్ గా ఉంటారు. ఆమె చాలా ఇంటెన్స్ పెర్ఫార్మర్. లింగిడి లింగిడి సాంగ్ కు ఇంత హ్యుజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఈ పాట వల్లే సినిమాకు మరింత బజ్ వచ్చింది. యూనిక్ పాయింట్ తో బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో రాబోతున్న కోటబొమ్మాలి చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
 
ఇక గీతా ఆర్ట్స్ సంస్థలో నాన్నగారు అసిస్టెంట్ ఫైటర్ గా, ఫైట్ మాస్టర్ గావర్క్ చేశారు. అదే అదే సంస్థలో నేను హీరోగా చేయడం ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. నాకు కూడా ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాంటిది. షూటింగ్ మొదలైన వారం రోజులకే నా కాలు ఫ్రాక్చర్ అవడంతో.. ఈ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పిస్తారనుకున్నా. కానీ బన్నీ వాసు గారు విద్యా గారు అలా చేయలేదు. నేను తిరిగి కోలుకునే వరకు నాలుగు నెలలు వెయిట్ చేయడం వాళ్ల గొప్పతనం. ఇలాంటి సంస్థలో సినిమా చేయడం చాలా హెల్తీగా ఉంటుంది. ఈ సినిమా నా కెరియర్ కు చాలా ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నా. లీడ్ గానే కాకుండా మంచి పాత్ర దొరికితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం ఆర్కా సంస్థలో ఒక రియాల్టి షో చేస్తున్నా"'.