1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 మే 2024 (11:49 IST)

పుష్ప పుష్ప.. సాంగ్ తో అల్లు అర్జున్ ఆల్ టైమ్ ఇండియా రికార్డ్

Pupshpa song
Pupshpa song
'పుష్ప: ది రూల్', తో గ్రాండ్ స్కేల్, పాన్-ఇండియన్ అప్పీల్‌తో, జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు అల్లు అర్జున్ ముందున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ని ఆగస్ట్ 15న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌కి అరుదైన ప్రత్యేకత ఉందని ప్రకటించడం ఆనందంగా ఉంది.
 
'పుష్ప పుష్ప' విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ పాటగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సంపాదించుకుంది. దీని నవీకరించబడిన వీక్షణల సంఖ్య 26.6 మిలియన్లు.
 
ఐకాన్ స్టార్ అత్యంత ఖచ్చితత్వంతో హుక్ స్టెప్‌ని అందించిన ఈ పాటకు 1.27 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ఇది 15 దేశాల్లో ట్రెండ్‌గా కొనసాగుతోంది.
 
ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు విజయ్ పోలాకి, సృష్టి వర్మ ఈ పాటకు పనిచేశారు. పాటతో ముడిపడి ఉన్న ప్రతి ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి.
 
యాక్షన్ డైరెక్టర్లు పీటర్ హెయిన్, కెచా కంఫక్డీ, డ్రాగన్ ప్రకాష్, నబకాంత ఈ సినిమాకు పనిచేయడం విశేషం.