బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (09:48 IST)

పుష్ప: ది రైజ్‌తో అదిరే రికార్డులు.. హిందీ రైట్స్ రూ.200కోట్లు

Pushpa 2
ఐకాన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పుష్పతో అల్లు అర్జున్ నిర్మాతలకు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. హిందీ థియేట్రికల్ రైట్స్ అడ్వాన్స్ ప్రాతిపదికన రూ.200 కోట్ల రికార్డు ధరకు అనిల్ తడానీకి విక్రయించినట్లు సమాచారం.
 
మరోవైపు ఈ చిత్రం డిజిటల్ హక్కులు కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ చిత్రం డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం (250 కోట్లు) వెచ్చించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
ప్రైమ్ వీడియో మొదటి భాగానికి హక్కులను కలిగి ఉంది. ఇది ఇప్పటికే భారీగా డబ్బు సంపాదించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను బీట్ చేసి డిజిటల్ రైట్స్‌లో ఈ చిత్రం మళ్లీ ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసిందని టాక్ వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.