ఏపీ పరిషత్ ఎన్నికల్లో సాఫీగా కౌంటింగ్.. కూటమి జోరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సాఫీగా సాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి అభ్యర్థుల జోరు కనిపిస్తోంది. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా స్థానాల్లో.. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో రెండు వేలకుపైగా చోట్ల కూటమి హవా కొనసాగుతోంది. గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 74 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అలాగే, మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవి విజయం సాధించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్‌పేట ఎంపీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీదక్కించుకుంది. కడప జిల్లా పెద్దముడియం మండలం సుద్దపల్లె ఎంపీటీసీ స్థానంలో టీడీపీ గెలుపొందింది.
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ తెదేపా అభ్యర్థి భారతి 1463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమితో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైకాపా నేతలు వెనుదిరిగారు. మరోవైపు మైదుకూరు జడ్పీటీసీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరిపోయింది.

