సంబంధిత వార్తలు
- ఏపీపీఎస్సీసీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
- జెఈఈ మెయిన్స్ 2023 మొదటి సెషన్లో 99కు పైగా పర్సంటైల్‌ను సాధించిన నలుగురు ఆకాష్‌బైజూస్ విద్యార్థులు
- జెఈఈ మెయిన్స్ 2023 మొదటి సెషన్లో 99కు పైగా పర్సంటైల్‌ను సాధించిన ఆకాష్‌బైజూస్ విద్యార్థులు
- ఎంబీబీఎస్ అభ్యర్థులకు కేంద్రం శుభవార్త - నీట్ పీజీ 2023 గడువు పెంపు
- జేఈఈ మెయిన్స్ ఫలితాలు రిలీజ్ - ఎన్.టి.ఈ వెబ్సైట్లో చూడొచ్చు
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా.. కారణం అదే
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడ్డాయి. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేశారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ తొలి వారానికి వాయిదా వేసింది. ఇందులో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు.. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఏపీపీఎస్పీ తెలిపింది. అభ్యర్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఏపీపీఎస్పీ వెల్లడించింది.
