శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (18:39 IST)

ఏపీపీఎస్సీసీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

appsc
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన ఏపీ పీఎస్సీ గ్రూపు-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేశారు. వచ్చే నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సివుంది. వీటిని యూపీఎస్సీ పరీక్షల కారణంగా జూన్ మొదటివారానికి వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, 2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ షెడ్యూల్‌ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూపు-1 మెయిన్స్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి 25 మందికిపైగా గ్రూపు-1 అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.