బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (17:00 IST)

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా

bandi sanjay
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అపాధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టదలచిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది. కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌‌ను సోమవారం వెల్లడించింది. దీంతో సంజయ్‌ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. 
 
నిజానికి ఈ నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టాలని సంజయ్‌ నిర్ణయించుకున్నారు. కానీ, ఉపఎన్నిక నేపథ్యంలో మార్చుకుంటున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. యాత్రను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
మరోవైపు, మునుగోడుతో పాటు అంధేరి ఈస్ట్‌ (మహారాష్ట్ర), మోకమా (బిహార్‌), గోపాల్‌గంజ్‌ (బిహార్‌), అదంపూర్‌ (హరియాణా), గోల గోఖర్నాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ధామ్‌నగర్‌ (ఒడిశా)లో స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.