గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (15:19 IST)

దీపావళికి శివకార్తికేయన్ "ప్రిన్స్" రిలీజ్

prince movie
తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం "ప్రిన్స్". సురేశ్ ప్రొడక్షన్ బ్యానరులో నిర్మించే ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమం అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. దీపావళికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా ఉక్రెయిన్ భామ నటిస్తున్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా ఈ సినిమాను తీసుకురానున్నారు. 
 
ఈ సందర్భంగా సినిమా విడుదల విషయాన్ని తెలియజేస్తూ, శివ కార్తికేయన్‌, అనుదీప్‌, సత్యరాజ్‌, మరియాలు కలిసి మాట్లాడుకునే ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. 'ప్రిన్స్‌' ఎందుకు ఆలస్యమవుతోందని సత్యరాజ్‌ అడగ్గా, అఫ్గానిస్థాన్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, అంటార్కటికాలలో విడుదల చేద్దామనుకున్నామంటూ అనుదీప్‌ చెబుతున్న వీడియో నవ్వులు పూయిస్తోంది. 
 
సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, శాంతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనుదీప్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు. 'డాక్టర్‌', 'డాన్‌' తదితర అనువాద చిత్రాలతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెల్సిందే.