ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (20:07 IST)

జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా

jee exam
జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదాపడ్డాయి. గురువారం నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు జాతీయ పరీక్షల మండలి (ఎన్.టి.ఏ) తెలిపింది 
 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రెండో విడత పరీక్షలు జులై 21న ప్రారంభమై 30న ముగియాల్సి ఉంది. అయితే, వాయిదా పడిన పరీక్షలు జులై 25 నుంచి ప్రారంభమవుతాయని ఎన్‌టీఏ బుధవారం వెల్లడించింది. 
 
పరీక్షలకు సంబంధించి రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన చేసింది. అయితే, పరీక్షలు వాయిదా వేయడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు 
 
కాగా.. జేఈఈ మెయిన్స్‌​ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ముగిసిన తర్వాత అడ్మిషన్స్ ప్రారంభంకావాల్సివుంది.