మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (15:05 IST)

తెలంగాణాలో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష షెడ్యూల్ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఆగిపోయిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష తేదీని ఖరారుచేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షను షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 30, 31న ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. 
 
అదేవిధంగ ఆగస్టు 1న ఈసెట్‌, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత వెబ్‌సైట్‌ల నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా.. జులై 14, 15న జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన విషయం తెలిసిందే.