పోటెత్తిన వరద - శ్రీరాంసాగర్ 22 గేట్లు ఎత్తివేత
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇలాంటి వాటిలో శ్రీరాంసాగర్ ఒకటి. ఈ ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్‌కు ఉన్న 22 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ఈ డ్యామ్‌లోకి 90 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ నుంచి 95 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు.
ఇదిలావుంటే శ్రీరాం సాగర్ నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1088గా వుంది. అలాగే, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థఅయం 90.3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 76.424 టీఎంసీలుగా ఉంది.