గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (11:44 IST)

నేడు కొత్త లంకాధిపతి ఎన్నిక - రేసులో దులన్ అలహా పెరుమాను

srilanka president house
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంకలో బుధవారం కొత్త లంకాధిపతి ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే కొనసాగుతున్నారు. దీంతో లంక కొత్త పార్లమెంట్ నేడు కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది. కాగా, 44 యేళ్లలో శ్రీలంక దేశాధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రజల తిరుగుబాటుకారణంగా మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం వడిచి పారిపోయాడు. ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షుడుగా రణిలి విక్రమ సింగ్ ప్రమాణం చేశారు. ఈయన సారథ్యంలో బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 
 
మరోవైపు, కొత్త లంకాధిపతి రేసులో దులస్ అలహోప్పెరుమాను, ప్రధానమంత్రి పదవికి సాజిత్ ప్రేమదాస ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్‌లో 225 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎస్ఎల్‌పీపీకి 101 మంది, ఎస్.జే.బికి 50, మిగిలిన సభ్యులు ఇతర చిన్నాచితక పార్టీలకు చెందిన వారుగా ఉన్నారు.