బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 జూన్ 2022 (12:24 IST)

మంత్రి బొత్స సత్యనారాయణ రాలేదని పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేసారా ?

ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ ఉదయం వెల్లడి కావాల్సి వుంది. ఫలితాలు ఈరోజు విడుదలవుతాయనగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఐతే హఠాత్తుగా పరీక్షా ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేసినట్లు చెపుతున్నారు.

 
కొత్త మంత్రివర్గం కూర్పు అనంతరం అధికారంగా వెలువడాల్సిన పరీక్షా ఫలితాలు వాయిదా పడటంపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కాగా కరోనా వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులంతా ఇంటర్మీడియట్‌కు ప్రమోషన్ పొందారు. మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో ఈ ఏడాది పరీక్షలను నిర్వహించారు. 

 
మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,00,063 మంది బాలురు కాగా... 3,02,474 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.