1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (09:58 IST)

ప్రభాస్ - ఓం రౌత్ "ఆదిపురుష్" చిత్రం విడుదల వాయిదా!

Adipurush
స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "ఆదిపురుష్". రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం విడుదల తేదీని మరోమారు మార్చారు. తొలుత వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. 
 
"ఆదిపురుష్" అనేది ఒక సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరింత సమయం తీసుకోవాల్సి వస్తుంది. వచ్చే యేడాది జూన్ 16వ తేదీన 'ఆదిపురుష్' చిత్రాన్ని విడుదల చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మిల్ని నడిపిస్తున్నాయి" అని ట్వీట్ చేశారు.