జేఈఈ మెయిన్స్ ఫలితాలు రిలీజ్ - ఎన్.టి.ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి సెషన్ పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్.ఐ.టీలలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ తొలి విడుదల పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే.
ఈ పరీక్షలకు జేఈఈ చరిత్రలోనే 95.8 శాతం మంది అంటే 8.22 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) వీటి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in లేదంటే ntaresuts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడొచ్చు.
కాగా, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరో తేదీన నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. రెండో సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ సెషన్ పరీక్షల సిట్ స్లిప్‌లను మార్చి 3వ తేదీన విడుదల చేయనుండగా చివరి వారంలో అడ్మిట్ కార్డులను రిలీజ్ చేయనున్నారు.