1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Arnab likely to strike between Bapatla, Vizag as very severe

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాను అర్నాబ్

arnab cyclone
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది వేగంగా బలపడతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఇది రానున్న గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెను ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబరు 28వ తేదీన బాపట్ల - విశాఖపట్టణం మధ్య తీరందాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలకు ప్రీ జఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలకు 'ప్రీ-సైక్లోన్ వాచ్' జారీ చేసింది. ఈ తుపానుకు అర్నాబ్ అని పేరు పెట్టిన విషయం తెల్సిందే. 
 
శనివారం భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ ప్రకారం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తొలుత దక్షిణ దిశగా కదిలి, అక్టోబరు 25వ తేదీన తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత దిశ మార్చుకుని పశ్చిమ వాయవ్య దిక్కుగా ప్రయాణించి మరింత శక్తిని పుంజుకోనుంది.
 
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ వ్యవస్థ అక్టోబరు 26 నాటికి తుపానుగా, 27 నాటికి తీవ్ర తుపానుగా, 28వ తేదీ ఉదయం నాటికి అతి తీవ్ర తుపానుగా మారుతుంది. అక్టోబరు 28వ తేదీన ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బాపట్ల విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గాలి వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగానికి చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
తుపాను ఏర్పడటానికి, అది బలపడటానికి సముద్రంలో పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటం, మాడెన్ జూలియన్ ఆసిలేషన్ (MJO) వంటి వాతావరణ అంశాలు ఈ తుపాను తీవ్రతను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వాతావరణ నమూనాలు (మోడల్స్) కూడా ఈ తుపాను ఏపీ తీరం వైపే వస్తుందని, అతి తీవ్రంగా మారుతుందని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని నమూనాలు ఒడిశా లేదా తమిళనాడు వైపు సూచించినప్పటికీ, అందుకు అవకాశాలు తక్కువ అని భావిస్తున్నారు.
 
ప్రస్తుత అంచనాల కచ్చితత్వంపై వాతావరణ శాఖ స్పందించింది. తుపాను మార్గం, తీవ్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమాచారాన్ని అందిస్తామని తెలిపింది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు, సముద్రపు అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హమ్మయ్య పులిని పట్టేశారు.. నరభక్షక పులిని పట్టుకున్న సిబ్బంది