సంబంధిత వార్తలు
- ఆస్కార్ ఈవెంట్‌కు ముందు ఉత్సాహంగా ఉన్నా: రామ్ చరణ్
- బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడి బలంగా,శక్తివంతంగా వున్నా: హంసా నందిని
- అమెరికాలో చెర్రీ-ఉపాసన బేబీమూన్.. ఫోటోలు వైరల్
- ప్రిన్సిపాల్ - హాస్టల్ వార్డెన్ వేధించడం వల్లే విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య
- గాలి వేగంలో మార్పులు... విమానంలో కుదుపులు.. ప్రయాణికుడు మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి!!
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థి ఒకరు అనుమానాస్పదంగా కన్నుమూశారు. అయితే, ఆయన్ను హత్య చేశారా? లేక ఆత్మహత్య చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సివుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన గోవాడ నాగసాయి గోపి అరుణ్‌కుమార్ (23)కు ఉన్నతవిద్యపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు.. తమ ఆస్తులను కుదువ పెట్టి మరీ అమెరికాలో ఎంఎస్ చేసేందుకు ఏడు నెలల క్రితం పంపించారు.
అక్కడికి వెళ్లిన అరుణ్‌కుమార్ ఈ నెల ఒకటి నుంచి కనిపించడంలేదని స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ తేదీన అతను ఉండే నివాసానికి సమీపంలోని సరస్సులో అరుణ్ మృతదేహం పోలీసులకు లభించిందని సన్నిహితులు వెల్లడించారు. మృతదేహానికి అమెరికా పోలీసులు శవపరీక్షలు నిర్వహించి, అక్కడి స్నేహితుల సహకారంతో స్వదేశానికి పంపించారు.
కుమారుడి భౌతిక కాయాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పేద కుటుంబంలో జన్మించినా.. చదువులో రాణించిన కుమారుడికి విదేశాల్లో ఉన్నతవిద్యను అందించాలన్న వారి కలలు గల్లంతయ్యాయి. కన్న కొడుకు నిర్జీవంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు.
తర్వాతి కథనం
