ఆస్కార్ ఈవెంట్‌కు ముందు ఉత్సాహంగా ఉన్నా: రామ్ చరణ్
రామ్ చరణ్ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఎంటర్టైన్మెంట్ టుడే లో మాట్లాడుతూ.. ఆదివారం 95వ అకాడమీ అవార్డుల వేడుకకు ముందు తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. పలు విషయాల గురించి తెలిపారు. ఆర్. ఆర్. ఆర్. లాంటి గొప్ప చిత్రంలో తాను భాగం అయ్యినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నానని అందుకు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపాడు.
"నేను ఆస్కార్‌కి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటానో లేదో నాకు తెలియదు. నేను చాలా ఉద్విగ్నంగా, చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను మొదట్లో నటుడిగా ఉంటానో లేదా అభిమానిగా ఉంటానో నాకు తెలియదు. నేను ప్రతి నటిడిని. చూస్తూ పెరిగాను," అని చెప్పాడు, తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అయితే కేట్ బ్లాంచెట్, టామ్ క్రూజ్‌లను స్టైల్ నచ్చిందని అన్నాడు. . కేట్, ఆస్ట్రేలియన్ మహిళా నటి, 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' త్రయం (2001-2003) మరియు 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్' (2008) వంటి మైలురాయి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.
'నాటు నాటు' డ్యాన్స్ నంబర్ ఎలా వచ్చిందో యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లో చిత్రీకరణ యొక్క విశేషాంశం తండ్రి చిరంజీవి ప్రభావం గురించి చెప్పాడు.