శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 12 మార్చి 2023 (10:20 IST)

డాడీ వస్తున్నారంటే వణికిపోతూ మంచం కింద దాక్కునేదానిని... స్వాతి

swathi malival
తన తండ్రి వస్తున్నారంటే భయంతో వణికిపోతూ మంచం కింద దాక్కునేదానిని అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్యంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇపుడు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
శనివారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, తాను కూడా లైంగిక వేధింపులు బాధితురాలినేనని చెప్పారు. తాను 4వ తరగతి చదువుతున్న సమయంలో మేం ఆయనతో కలిసే ఉన్నామని చెప్పారు. ఆయన తనను అకారణంగా కొట్టేవారని తెలిపారు. కొన్నిసార్లు రక్తస్రావం కూడా వచ్చేదని గుర్తు చేశారు. తన తండ్రి ఇంటికి వస్తున్నారంటూ భయంతో వణికిపోయేవాళ్ళం. ఆయన లైంగిక వేధింపులు భరించలేక పలుమార్లు మంచం కింద దాక్కున్నానని స్వామి తెలిపారు. 
 
కాగా, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 8 ఏళ్ల వయసులోనే తాను తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తనకు 15 ఏళ్ల వచ్చాక తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టానని, ఆ తర్వాత ఏడాదికే ఆయన తమను వదిలేసి వెళ్లిపోయారని ఖుష్బూ తెలిపారు.