శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (20:05 IST)

మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్... ఏపీలో కలకలం.. మగపిల్లలే టార్గెట్

kids i
మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్ ఉదంతం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్రలో అదృశ్యమైన చిన్నారులు మన రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. 
 
ఈ ఘటనలపై అక్కడ మిస్సింగ్‌ కేసులు నమోదు చేసిన మరాఠీ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. పిల్లలను కిడ్నాప్‌ చేసి అమ్ముకుని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న ముఠా మూలాలు బయటపడ్డాయి. 
 
అయితే మరాఠ పిల్లలను కిడ్నా ప్‌ చేసిన ముఠా చేతులు మారి ఏపీ రాష్ట్రంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన ఓ మహిళ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
మగ పిల్లలే లక్ష్యంగా అక్కడ కిడ్నాప్‌లకు పాల్పడిన ముఠా చిన్నారులను రాష్ట్రానికి తీసుకువచ్చి ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో లక్షలకు విక్రయించేశారు. ఈ ముఠా మూలాలు కూడా ఇక్కడే ఉండటంతో విజయవాడ కమిష నరేట్‌ పోలీసులు దృష్టి సారించారు.