1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Bond Uma press meet over Ippatam issue

పవన్ కళ్యాణ్ హత్యకు రూ.250 కోట్ల సుపారీ : బోండా ఉమ

bonda uma
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను హత్య చేసేందుకు రూ.250 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఆయన శనివారం మంగళగిరిలో ఇప్పటం గ్రామలో గృహాల కూల్చివేతపై మాట్లాడారు. ఇప్పంటిలో రహదారి విస్తరణ కోసం అని చెబుతున్నారు. 
 
రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూల్చడానికి ఒక్క తట్ట మట్టి వేశారా అని నిలదీశారు. టీడీపీ హయాంలో నిర్మిచిన టిడ్కో ఇళ్లు బూజు పట్టగా, నేడు ఉన్న ఇళ్ళు కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూల్చివేసిన అధికారులు వైఎస్ విగ్రహానికి మాత్రం పోలీసులు కాపలా ఉండా కాపాడరన్నారు. 
 
అలాగే, చంద్రబాబు రోడ్‌షో‌లో ఆయనను హతమార్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎమ్మెల్సీ, ఎమెల్సీలను ముద్దాయిలుగా చేర్చి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ముఖ్య అనుచరుడే ఈ రాళ్లదాడికి ప్రధాన సూత్రధారని ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు రూ.250 కోట్లసు సుపారీ కుదుర్చుకున్నారని, దీనిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజనింగ్