1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Botsa sathyanarayana press meet live

వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలా.. బొత్స ఫైర్

Botsa sathyanarayana
ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలు గుప్పించే టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గతంలో ఇళ్ల పట్టాల విషయంలో కూడా టీడీపీ ఇలాగే అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. 
 
ఈ పథకం ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చింది కాదని... పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగినందుకే తీసుకొచ్చామని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు.పేదల కోసం తెచ్చే మంచి పథకాలను కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.  
 
పంచాయతీ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉండొచ్చని బొత్స అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారని... ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేశామని బొత్స గుర్తు చేశారు. 
తర్వాతి కథనం
ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...