1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Malladi Vasu sensational comments on YSRCP leaders

ఆ ముగ్గురు వైకాపా నేతలను లేపేస్తే రూ.50 లక్షల రివార్డు : మల్లాది వాసు

Malladi Vasu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతకు తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార తెరాస కౌన్సిలర్ ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ మంత్రి కొడాలి నాని, వైకాపా పంచన చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత అంబటి రాంబులను భౌతికంగా లేకుండా చేస్తే (చంపేస్తే) రూ.50 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌గా మల్లాది వాసు కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు నేతలు మదపుటేనుగుల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు చంపేందుకు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయాలని, ఇందుకోసం అవసరమైతే రూ.50 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 
 
కమ్మ సంఘం వన సమారాధనల్లో మల్లాది వాసు ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఒకపుడు కమ్మవారికి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని చంపేరాని, ఇందుకోసం మొద్దు శీనును వాడుకున్నారన్నారు. పరిటాల రవి ఇపుడు జీవించివుండి వుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. మాటిమాటికి నోరు జారుతున్న ఈ ముగ్గురి ఆట కట్టించేందుకు కమ్మ పెద్దలందరూ ఓ ప్రణాళిక చేపట్టాలంటూ సూచన చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 
తర్వాతి కథనం
వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలా.. బొత్స ఫైర్