1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandra Babu Naidu comments about Amaravati

అమరావతిలో 9 నగరాలు ప్లాన్ చేశాం.. ఏపీ సీఎం చంద్రబాబు

chandrababu
హైదరాబాద్ కంటే అమరావతిలో భూముల ధరలు ఎక్కువగా వుండేవని.. హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత భూముల ధరలు పెరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో వ్యవసాయ భూములు వుండటంతో ధరలు ఎక్కువ. అలా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చి.. పక్కన కొనుగోలు చేసిన వాళ్లు లాభపడ్డారు. 
 
ఇప్పుడు అమరావతి రైతులు కూడా అదే విధంగా ముందుకొచ్చారు. ఇదొక కేస్ స్టడీ.. అంటూ బాబు అన్నారు. తనకున్న అనుభవంతో తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేయించానని, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని బాబు అన్నారు. 
 
విభజన తర్వాత పరిపాలన చేసేందుకు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని.. ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయమే తన క్యాంపు కార్యాలయమని.. బస్సులోనే బస చేసేవాడిని అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
 
కానీ రాజధాని ఉంటేనే ఏపీకి భవిష్యత్‌ ఉంటుందని సంకల్పించామని.. ఈ క్రమంలో అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించిందని.. ఇకపై అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పుకొచ్చారు. 
 
ఈ క్రమంలో అమరావతిలో 9 నగరాలు ప్లాన్ చేశామని బాబు అన్నారు. అందులో ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇవన్నీ కూడా నాలుగు ఆఫీసులు కట్టేస్తే అయిపోదన్నారు. 
తర్వాతి కథనం
సమస్యలపై మాట్లాడమంటే సమోసా ధరలు తగ్గించాలంటున్నారు : రాఘవ్‌పై ఆప్ ఫైర్