సంబంధిత వార్తలు
- సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్
- మారువేషంలో గుంటూరు జిల్లా కలెక్టర్, విదిలించి కొట్టిన ఆసుపత్రి సిబ్బంది
- 36 Lakh Laddus : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు- 36 లక్షల లడ్డూల తయారీ
- మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...
- డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట
వైకాపా అనుకూల పాస్టర్ చింతాడ ఆనంద్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రద్దు
వైకాపా అనుకూల పాస్టర్‌గా పేరొందిన పాస్టర్ చింతాడ ఆనంద్‌కు గతంలో రెవెన్యూ అధికారి జారీచేసిన కుల ధృవీకరణ పత్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పాస్టర్ ఆనంద్ క్రైస్తవ మతాన్ని స్వీకరించి, పాటిస్తున్నట్టు విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనకు జారీచేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్‌ను రద్దు చేశారు.
జిల్లాలోని పిట్టలవాని పాళెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ వివాదం మొదలైంది. గతంలో తనపై చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని రామిరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. క్రైస్తవ పాస్టర్‌గా ఉన్న ఆనంద్‌కు ఎస్సీ చట్టం వర్తించదని వాదించారు.
హైకోర్టుకు రామిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో పాస్టర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో 2026 మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు షెడ్యూల్ కులాల కిందకు రారని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి పరిశీలన కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునేందుక చింతాడ ఆనంద్‌కు 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ నిర్ణయంపై చింతాడ స్పందిస్తూ, నేను ఎస్సీగా పుట్టాను. క్రైస్తవాన్ని విశ్వసించాను. కానీ, కులాన్ని మార్చుకోలేదు. ఎస్సీ హోదా కోసం పోరాటం సాగిస్తాన్ అని తెలిపారు.
మరోవైపు, అక్కల రామిరెడ్డి మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వంలో తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి వేధించారు. న్యాయపోరాటం చేసి గెలిచాను. కలెక్టర్ నిర్ణయం హర్షణీయం అని తెలిపారు.
