సంబంధిత వార్తలు
- ఎఫైర్, తనను దూరం పెట్టిందని చిన్నారి గొంతు కోసిన దుర్మార్గుడు
- బాయ్‌ఫ్రెండ్‌తో సొంతూరికి మైనర్ బాలిక.. రాత్రంతా సామూహిక అత్యాచారం..
- చిత్తూరులో కరోనా కేసులన్నీ ఆ రాష్ట్రాల వచ్చిన వారి నుంచే...
- క్వారంటైన్లో ఉన్న బాలికను పక్కలోకి పిలిచిన ఉద్యోగి... ఎక్కడ?
- నన్ను ప్రేమించమంటే ప్రేమించవా? మైనర్ బాలికను బీరు సీసాతో పొడిచేశాడు
ఏపీలో వాలంటీర్ల ఓవరాక్షన్.. మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అఘాయిత్యం
ఏపీలో వాలంటీర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న జీతాలు చాలక చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజల కోసం నియమించబడిన గ్రామ వాలంటీర్లు అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చిన ప్రజల అవసరాలను సాకుగా వారిపై వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ వాలంటీర్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుపతిలోని పుంగనూరు మండలం గూడూరుపల్లెలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన గ్రామ వాలంటీర్ నరేశ్ అదే ఊరికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని స్నానం చేసి ఇంటిలోకి వెళ్తుండగా అటకాయించిన వాలంటీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అయితే సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదుకు 2రోజుల ముందే నరేష్‌పై కేసు కానివ్వకుండా కాపాడే ప్రయత్నం చేశారు.. ఆ గ్రామం వైసీపీ నాయకులు. పంచాయితీ పెట్టి విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
