శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (07:59 IST)

క్వారంటైన్‌లో ఉన్న బాలికను పక్కలోకి పిలిచిన ఉద్యోగి... ఎక్కడ?

అసలే కరోనా వైరస్ బారినపడిన ఆ బాలిక... ఒంటరిగా క్వారంటైన్‌లో గడుపోతుంది. ఆ బాలిక వైరస్ బారినుంచి కోలుకునేలా భరోసా కల్పించాల్సిన ఓ ఉద్యోగి.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పైపెచ్చు.. పడక సుఖం ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. 
 
అతని వేధింపులు భరించలేని ఆ బాలిక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడంతో కామాంధ ఉద్యోగి పారిపోయాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలోని ఉనాకోటి జిల్లా కుమార్ ఘాట్ ఏరియాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నార్త్ త్రిపురలోని కుమార్ ఘాట్‌కు చెందిన ఇద్దరు బాలికల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, పంచాయతీరాజ్ శాఖకు చెందిన రిజిబ్ కాంతిదేబ్ అనే ఉద్యోగి తాను పారామెడికల్ ఉద్యోగినని చెప్పి, బాలికలను పరీక్షించాలని చెప్పి వాటి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, పడక సుఖం ఇవ్వాలంటూ బలవంతం చేశాడు. 
 
ఆ ఉద్యోగి అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగి అసభ్య ప్రవర్తనపై దర్యాప్తు చేస్తున్నామని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో కీచక ఉద్యోగి కాంతిదేబ్ పరారీలో ఉన్నారు.