సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (13:08 IST)

ఇంట్లో స్థలం లేదు.. అందుకే టాయ్‌లెట్‌లో 7 రోజులు క్వారంటైన్‌లో వున్నాడు..

కరోనా వైరస్ విస్తరించడంతో క్వారంటైన్ కేంద్రాలు తక్కువగా వున్నాయి. ఆస్పత్రిలో వారం రోజులకు పైగా వుంచలేమని చెప్పడంతో.. కుటుంబ భద్రత కోసం.. ఓ 28ఏళ్ల వ్యక్తి బాత్రూమ్‌లోనే క్వారంటైన్‌ను కొనసాగించాడు. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం పరంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు కరోనా వ్యాప్తి కారణంగా తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. అలాగే తమిళనాడులో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువకుడు మానస్ పత్రా తన సొంత ఊరు ఒడిశాకు తిరిగి వెళ్లాడు. 
 
ఒడిశాలోకి ఎంటర్ కాగానే వారం రోజుల పాటు సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం నడుపుతున్న తాత్కాలిక వైద్య శిబిరం క్వారెంటైన్‌లో ఉంచారు అధికారులు. కరోనా లక్షణాలేమీ కనిపించకపోవడంతో ఏడు రోజులకు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత హోమ్ క్వారెంటైన్ మరో వారం రోజులపాటు ఉండాలని చెప్పారు.
 
ఆరు మంది కుటుంబ సభ్యులున్నతన ఇంట్లో తగినంత స్ఠలం లేదు. టిఎంసిలో తన బసను పొడిగించాలని మానస్ పత్రా కోరాడు. పొడిగింపుకు అనుమతి లేదని అధికారి తెలిపారు.

ఇంట్లో మరొక గది లేకపోవడంతో కుటుంబ సభ్యుల భద్రత కోసం టాయిలెట్‌లో ఉండాల్సిన వచ్చిందని పత్రా చెప్పుకొచ్చాడు. అతను కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డిలోనే జూన్ 9 నుండి 15 వరకు ఏడు రోజులు గడిపాడు.