ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: బుధవారం, 17 జూన్ 2020 (15:39 IST)

తమిళనాడు సీఎం పళణిస్వామి పిఎ కరోనావైరస్ వ్యాధితో మృతి, మరో 200 మంది?

తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. తమిళనాడులోని సెక్రటరియేట్‌లో 200 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వ్యక్తిగత కార్యదర్సి దామోదరం. దీంతో భయం గుప్పిల్లో తమిళనాడు సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నారు. 
 
ఇప్పటికే పలువురు అధికారులు సమారు 200 మందికి కరోనా వ్యాపించడంతో చికిత్స పొందుతున్నారు. జూన్ 19వ తేదీ నుంచి కేవలం 33 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేస్తామంటున్నారు తమిళనాడు సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేతలు.
 
55 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు, గర్భిణీ మహిళలు, కంటోన్మెంట్ నుంచి వచ్చేవారికి విధుల హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్సి మరణించిన నేపథ్యంలో సెక్రటేరియట్ మొత్తాన్ని కొద్దిరోజుల పాటు మూసివేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.