ఎఫైర్, తనను దూరం పెట్టిందని చిన్నారి గొంతు కోసిన దుర్మార్గుడు

వి| Last Modified గురువారం, 2 జులై 2020 (19:47 IST)
మేడ్చల్‌లో దారుణం చోటుచేసుకున్నది. అభంశుభం ఎరుగని ఓ చిన్నారిని గొంతుకోసిన దుండగుడు పరారయ్యాడు. ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటి పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్న కళ్యాణ్, అనూష దంపతుల ఆరేళ్ల కూతురు ఆద్యను గొంతు కోసి చంపేశాడు నిందితుడు కరుణాకర్.

గత కొద్ది కాలంగా అనూషతో కరుణాకర్ చనువుగా వుంటున్నాడు. కొద్ది రోజులుగా ఆమె అతడిని దూరంగా ఉంచడంతో అనూషపై కసి పెంచుకున్నాడు. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉన్న అనూష కూతురు ఆధ్యను మెల్లగా దగ్గరకు తీసుకుని గొంతుకోసి ఆ తర్వాత అతడు కూడా కత్తితో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కరుణాకర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.దీనిపై మరింత చదవండి :