1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. CM designate YS Jagan offered prayers at Tirumala temple

శ్రీవారి ఆశీస్సులతోనే సిఎం అయ్యాను : జగన్

YS Jagan Mohan Reddy
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతున్నానన్నారు వైఎస్. జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారిని జగన్మోహన్ రెడ్డి దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఒక సాధారణ భక్తుడిలాగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి తిరుమల శ్రీవారి సేవలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో జగన్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతోనే సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని, వెంకటేశ్వరస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
తర్వాతి కథనం
కాపురంలో చిచ్చుపెట్టిన మటన్ ముక్క... ఎలాగంటే?