శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (13:29 IST)

హలో.. బాబుగారూ.. నేను జగన్‌.. ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆశీర్వదించండి..

నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మాజీ అధ్యక్షుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఫోను చేశారు. ఈ నెల 30వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చిన తనను ఆశీర్వదించాల్సిందిగా జగన్ కోరారు. ఈ సందర్భంగా జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల్లో వైపాకా 151 అసెబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రెండో నూతన ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, సెలెబ్రిటీలను జగన్ ఆహ్వానిస్తున్న విషయం తెల్సిందే.