1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cyclone Akvan Alert to Andhra Pradesh

బంగాళాఖాతంలో మరో తుఫాను - పేరు అక్వాన్ - ఏపీకి మరో ముప్పు

Cyclone Murasu
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడి, ఇది తుఫానుగా మారింది. దీనికి ఇరాన్ దేశం అక్వాన్ అనే పేరు పెట్టింది. ఈ తుఫాను కూడా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీంతో మరో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించిన వివరాల ప్రకారం... దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 13వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది నవంబరు 14వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా మారి, నవంబరు 15వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నవంబరు 18వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయి.
 
గత రెండు తుఫానులతో పోలిస్తే ఈ వ్యవస్థ మార్గం భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రంలోనే దిశ మార్చుకుని (రీ-కర్వ్ అయి) ఉత్తర దిశగా పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉత్తర దిశగా సాగితే పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ తీరాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారిన తర్వాత దీని గమనం, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత వచ్చే వీలుంది.
 
మరోవైపు అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం... ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో అండమాన్ సముద్రంలో నవంబరు 14, 15 తేదీల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 14, 16 తేదీల్లో, నైరుతి బంగాళాఖాతంలో నవంబరు 15 నుంచి 17 వరకు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్ఠంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నా ఫోన్‌ను ప్రధాని స్వయంగా ట్యాపింగ్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ