1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Day Curfew continues in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన కర్ఫ్యూ.. వాహనరాకపోకలు బంద్

Andhra Pradesh
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతో ఏపీ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రా సరిహద్దులను మూసివేసింది. 
 
రామాపురం (కోదాడ), పొందుగుల (వాడపల్లి), నాగార్జునసాగర్ (మాచర్ల వైపు) మూడు చెక్ పోస్టులను మూసివేసింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దుల వద్ద వాహనాలు బారులు తీరాయి. అత్యవసర సేవలు మినహా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు.  
 
కాగా, బుధవారం నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారమే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుండగా విమాన, రైల్వే ప్రయాణికులు మాత్రం టికెట్లు చూపిస్తే మాత్రం అనుమతిస్తారు. 
 
ఇక, కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ,అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బందికి ఆంక్షల నుంచి మిహాయింపు ఇచ్చారు. అలాగే, మీడియాకు కూడా అనుమతి ఇచ్చారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నిజమైన ప్రాణదాత : 22 మంది ప్రాణాలు రక్షించిన సోనూసూద్