దేశంలో కరోనా వైరస్ ఉధృతి శరవేగంగా సాగుతోంది. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా ఆంక్షలను అమలవుతున్నాయి. ఇందులోభాగంగా, ఏపీలో కూడా బుధవారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకివచ్చాయి.
వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. ఇప్పటికే భారతావనిలోని చాలా ప్రాంతం వివిధ సమయాలకు గాను ఆ తరహా వాతావరణంలోకి జారుకుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించిన కఠిన ఆంక్షలను ఓ మారు పరిశీలిస్తే..
* పుదుచ్చేరిలో ఈ నెల 10 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.
* తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 20వరకు కఠిన ఆంక్షలు విధించింది.
* పశ్చిమబెంగాల్ గతవారం నుంచి అన్నిరకాల సమావేశాలపై నిషేధం విధించింది.
* కేరళ మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నట్లు ప్రకటించింది.
* ఢిల్లీ గత నెల 19 నుంచి లాక్డౌన్‌లో ఉంది. ఈ నెల 10 వరకు అక్కడే ఇదే పరిస్థితి.
* హర్యానాలో ఈ నెల మూడో తేదీ నుంచి ఏడు రోజుల లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
* రాజస్థాన్‌లో ఈ నెల 17వరకు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
* కర్ణాటక గత నెల 27 రాత్రి నుంచి మే 12 వరకు లాక్‌డౌన్ పాటిస్తోంది.
* ఉత్తరాఖండ్ రాత్రిపూట కర్ఫ్యూని మళ్లీ అమలు చేస్తోంది.
* గుజరాత్‌లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
* మధ్యప్రదేశ్ ఈ నెల 7 వరకు కరోనా కర్ఫ్యూ అమలు చేస్తోంది.
* మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగించింది.
* అస్సాంలో గత నెల 27 నుంచి ఈ నెల 7 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
* నాగాలాండ్‌లో గత నెల 30 నుంచి ఈ నెల 14 వరకు పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌లో నేటితో ముగియనున్న లాక్డౌన్‌ని 15 వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అమనుతి మంజూరు చేసింది.
* ఒడిశాలో ఈ నెల 5 (నేటి) నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నారు.
* పంజాబ్‌లో వారాంతపు లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి.
* జార్ఖండ్‌లో గత నెల 22 నుంచి మే 6 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.