1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Four new flights from Vijayawada

విజయవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు

new flights
విజయవాడ నుంచి ఒకేరోజు నాలుగు విమాన సర్వీసులు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. ఊ నెల 27 నుంచి ఈ సర్వీసులు నడిపేందుకు పౌరవిమానశాఖ నిర్ణయించింది. తిరుపతికి , విశాఖతో పాటు హైదరాబాద్‌కు రెండు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు.

ఈ నెల 27 న విజయవాడ నుంచి 4 విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు. తిరుపతి, విశాఖలతో పాటు హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

తిరుపతి-విజయవాడ మధ్య రానున్న ఎయిర్ బస్ వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. విజయవాడ-విశాఖ విమాన సర్వీసు తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సహా సివిల్ ఏవియేషన్‌కు లేఖలు రాశామని... అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు మరింత సమయం పడుతుందని అన్నారు. జూలై 2020 నుంచి హజ్ విమానాలు విజయవాడ నుంచే నేరుగా బయలుదేరతాయన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
అమరావతిలో నిర్మించిన భవనాలు కూల్చివేత? మంత్రి బొత్స ఏమన్నారు?