శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:48 IST)

విశాఖ-విజయవాడ మధ్య ఉదయ్ పరుగులు

విశాఖ, విజయవాడ మధ్య రైల్వే ప్రయాణికులకు సేవలందించే ఉదయ్ ఎక్స్​ప్రెస్​ను కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ సి.అంగడి విశాఖలో ప్రారంభించారు.

ఈ ఎక్స్​ప్రెస్​తో విశాఖ వాసుల కష్టాలు తీరనున్నాయని మంత్రి స్పష్టంచేశారు. విశాఖలో ఉదయ్ ఎక్స్​ప్రెస్​ను రైల్వేసహాయ మంత్రి సురేష్ సి. అంగడి ప్రారంభించారు. ఈ ఎక్స్​ప్రెస్ రోజూ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు విశాఖ నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంటుంది.

అనంతరం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విజయవాడ నుంచి విశాఖ బయల్దేరుతుంది. ఈ రెండు నగరాల మధ్య వారానికి 5 రోజుల పాటు సేవలనందించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విశాఖ వాసుల కష్టాలు తీరనున్నాయి ఉదయ్ ఎక్స్​ప్రెస్​తో విశాఖ వాసుల కష్టాలు తీరనున్నాయని కేంద్ర మంత్రి సురేష్ సి. అండగి వ్యాఖ్యనించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేరుకుందని స్పష్టం చేసిన ఆయన...విశాఖ వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు.

ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రైల్వేల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు.