26 నుంచి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌.. విజయవాడ-విశాఖ​ మధ్య పరుగు

uday express
ఎం| Last Updated: బుధవారం, 21 ఆగస్టు 2019 (20:03 IST)
ఈ నెల 26 నుంచి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ-విశాఖ​ మధ్య పరుగులు పెట్టనుంది. పూర్తి ఏసీ బోగీలతో నడిచే డబుల్​ డెక్కర్​ ఎక్స్​ప్రెస్​ ఉదయ్​కు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి పచ్చజెండా ఊపనున్నారు.

ఈ నెల 26న విశాఖ-మధ్య డబుల్ డెక్కర్ ఎక్స్​ప్రెస్​ను రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి ప్రారంభించనున్నారు. 27 నుంచి ప్రయాణికులకు అవకాశం కల్పిస్తారు. ఉదయం 5.45 గంటలకు నుంచి బయలుదేరి... 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది.

విజయవాడలో సాయంత్రం 5.30కి బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరిగి విశాఖ చేరుతుంది. ఇది ప్రయాణీకులకు సౌకర్యవంతంగా వుంటుందని రైల్వే శాఖ భావిస్తోంది.
దీనిపై మరింత చదవండి :