కనీసం గుడ్డును కూడా కాపాడుకోలేవా...? వితిక కామెంట్‌తో షాకైన వరుణ్

Varun sandesh
ప్రీతి| Last Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (16:48 IST)
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ఇప్పటివరకు విజయవంతంగా 23 ఎపిసోడ్‌‌లను పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌‌కి ఏకంగా ఏడుగురు నామినేట్ కావడంతో మిగిలిన ఎపిసోడ్‌లు రసవత్తరంగా ఉండనున్నాయి.

టాస్కుల పేరుతో గొడవపడే అవకాశాన్ని ఇస్తున్నట్లు విక్రమపురి, సింహపురి అని రెండు రాజ్యాలుగా విడగొట్టి గుడ్ల కోసం, జెండాల కోసం దెబ్బలాడుకోమన్నాడు బిగ్ బాస్. రెడ్ టీంకి శ్రీముఖి లీడర్‌గా పెట్టగా, బ్లూ టీంకి హిమజను లీడర్‌గా పెట్టి రెండు టీంలుగా విడగొట్టారు.

ఇక రెండు రాజ్యాలకు బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలని.. ఇక గేమ్‌లో ఉన్న గుడ్లను సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందంటూ గేమ్ మొదలు పెట్టించారు బిగ్ బాస్.

ఈ ఫిజికల్ గేమ్‌లో జెండాల కోసం, గుడ్లు కోసం ఒకరిపై ఒకరు పడుతూ లాక్కుంటూ పీక్కుంటూ కొట్టుకుంటూ ఆడ మగ తేడా లేకుండా రెచ్చిపోయారు హౌస్‌మేట్స్. బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించకూడదు, ఆస్తికి, మనుషులకు హాని కలిగించకూడదంటూ హితవు పలుకుతూనే ఇలాంటి గేమ్స్ ఇస్తుంటాడు బిగ్ బాస్.

ఇక ఈ గేమ్‌లో వరుణ్‌ దగ్గర నుండి సాఫ్ట్ గేమ్‌ ఆడి ఒక హౌస్‌మేట్ ఈజీగా గుడ్డును దొంగిలించాడు. దీంతో నువ్.. పెద్ద ఫ్రూట్‌వి గుడ్డు కూడా కాపాడుకోలేకపోయావు అంటూ ఛలోక్తి విసిరింది వరుణ్ భార్య వితికా షెరు.దీనిపై మరింత చదవండి :