ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (07:39 IST)

డ్రంకన్‌ డ్రైవ్ లో పట్టుబడిన ఐఏఎస్ ఆఫీసర్

మద్యం మత్తులో కారు నడిపి జర్నలిస్టు మృతికి కారణమయ్యాడన్న ఆరోపణలతో అరెస్టైన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్(33)​కు కేరళ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన మద్యం తాగి డ్రైవింగ్ చేశాడన్న పోలీసుల వాదనలో నిజం లేదని శ్రీరామ్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

శ్రీరామ్ బ్లడ్ శాంపిల్ రిపోర్టు పరిశీలించి.. ఆల్కహాల్ తీసుకుని కారు నడపలేదన్న డిఫెన్స్ వాదనను మెజిస్ట్రేట్ అనీశా అంగీకరించి బెయిల్ మంజూరు చేశారు. ఈనెల 3న ఓ పార్టీ నుంచి కారులో వస్తున్న శ్రీరామ్.. బైక్ మీద వెళ్తున్న జర్నలిస్టు మహమ్మద్ బషీర్(35)ను ఢీకొట్టారు. మళయాల పత్రిక ‘సిరాజ్’ బ్యూరో చీఫ్​ గా పనిచేస్తున్న బషీర్ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు.