శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (21:53 IST)

విజయవాడలో నకిలీ టీ పొడి.. ఇంటిపై టాస్క్‌ఫోర్స్ దాడి

విజయవాడ నగర్ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది నగరంలో వివిధ చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ క్రమంలో భాగంగా 13వ తేది టాస్క్ఫోర్ వారికి రాబడిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాస రావు, ఏసిపిలు కె.సూర్యచంద్రరావు, వి.ఎస్. ఎన్.వర్మ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలసి విజయవాడ, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గులాభీతోటలోని ఒక ఇంటిపై దాడిచేయగా సదరు ఇంటిలో గంటా భాస్కరరావు అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండ చట్ట వ్యతిరేఖంగా నకిలీ టీ పోడిని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాట్లు వెల్లడి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ. 3. 55 లక్షల వివువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 

విచారణలో గంటా భాస్కరావు అను అతను గత కొన్ని సంవత్సరాల నుండి విజయవాడ, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గులాభీతోటలోని ఒక ఇంటిలో నకిలీ టీ పొడిని తమిళనాడు, కోయంబత్తూర్ నుండి వేలంలో తక్కువ క్వాలిటీ కలిగిన టీ డస్ట్ను తీసుకువచ్చి, దానికి సింతటిక్ కలర్స్ అయిన టెట్రాజిన్, సన్ సెట్ అనే పదార్ధాలను కలిపిన దానిని అనేక టీ స్టాల్స్ కు సరఫరా చేస్తున్నాడు.

ఈ కృత్రియ రంగులు టీ పొడికి మంచి రంగు ఇవ్వడంతో పాటు టీ పౌడర్ యొక్క పరిమాణం తగించుకొని ఎక్కువ టీలు తయారు చేయుటకు ఉపయోగపడుతుంది. ఈ హానికరమైన పదార్థాల కలయకతో తయారు చేసిన టీని త్రాగిన వారికి మైగ్రాన్ తలనొప్పి, నరాల బలహీనత మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది.

ఈ విధంగా గంటా భాస్కరావు రోజుకు 150 నుండి 200 కేజీల వరకు కల్త్ టీ పొడిని ఆంధ్రరాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన గుంటూరు, మంగళగిరి, గిద్దలూరు, సత్తెనపల్లి, ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఉయ్యూరు, పామర్రులతో పాటు తెలంగాణా రాష్ట్రంలోని ఆర్మురు, హైదరాబాద్ మొదలగు అనేక ప్రాంతాలకు తన సేల్స్ బాయి ద్వారా ప్రతి రోజు విక్రయించడం జరుగుతుంది.

ఈ క్రమంలో నిందితుడు చేయబడిన టీ పొడి ప్యాకెట్లను రూ.150/- నుండి రూ. 200/- ధరకు అమ్ముచున్నట్లు వెల్లడైనది. బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్ టీ పొడి ప్యాకెట్ రూ. 300/- నుండి రూ.400/- ధరకు అమ్ముచుండగా, టీ స్టాల్ యజమానులు ఈ కత్తీటీ పొడిని తక్కువ ధరకు కొని లాభాలు గడిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజా ఆరోగ్యానికి హాని కల్గిస్తున్నారు.

నిందితుని వద్ద నుండి సుమారు రూ. 3,55,000/- లక్షల విలువ చేసే 1,200 కేజీల నాసిరకం టీ పొడి, 452 కేజీల కల్తీ చేయబడిన టీ పొడి మరియు 142 కేజీల సింతటిక్ రంగు అయిన టెట్రాజిన్ కలిపిన టీ పొడిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.