కోరిక తీర్చలేదని ఏం చేశాడో చూడండి
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక అగంతకుడు మహిళపై దాడి చేసి గొంతు కోసిన సంఘటన సంచలనం కలిగిస్తోంది.
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురం లో కొండపైన నివాసం ఉంటుంది రామలక్ష్మి. ఇళ్ళల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తనతో సహజీవనం చేయమని వేధిస్తున్నాడు.
తనకు పిల్లలు ఉన్నారని అటువంటి వాటికి తను ఒప్పుకోనని తెగేసి చెప్పింది. ఆగ్రహం పెంచుకున్న నాగేశ్వరావు ఆమెను హత్య చేసేందుకు పథకం వేసుకున్నాడు. పాత ఐదో నెంబర్ రూట్లో ఇళ్లల్లో పనిచేసి వస్తుందని ఆ సమయంలో హతమార్చాలని ముందుగా పథకం వేసుకున్నాడు. గురువారం సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్తున్న రామలక్ష్మి పై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు.
రామలక్ష్మి తలను చేత్తో పట్టుకొని కత్తితో పీక కోశాడు. రామలక్ష్మి బిగ్గరగా అరవడంతో సమీపంలోని వారు వచ్చి నాగేశ్వరావుని పక్కకు తోసి వేశారు. మెడపై గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో రామలక్ష్మి రోడ్డుపై కుప్పకూలిపోయింది.
స్థానికులు 108ను పిలిపించి రామలక్ష్మిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కోరిక తీర్చలేదని మహిళపై దాడి చేసి పీక కోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.