సంబంధిత వార్తలు
- శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!
- Hyderabad: ప్రేమలో మునిగి తేలుతున్నారు.. వాటిని ఆర్డర్ చేశారు..
- ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)
- కర్నూలు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉల్లి, రైతు ధర కిలో రూ. 15, ప్రజలకు రూ. 50
- Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?
టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం
టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు స్నాక్స్ అందిస్తామని చెప్పారు.
పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం 6 రకాల స్నాక్స్ అందించనున్నారు. వారంలో రోజుకొక రకం అందించనున్నారు. ఉడికించిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడా, ఆనియన్ శనగలు, బాయిల్డ్ పెసర్లు, పల్లి పట్టి, మిల్లెట్ బిస్కెట్లు అందించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకోసం ఒక్కో స్టూడెంట్‌కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
