మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జనవరి 2025 (21:34 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

venkateswara swamy
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు. సోమవారం అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్‌లో భాగంగా, దాదాపు ఐదు వేల మంది భక్తులకు ఉల్లిపాయ వాడకుండా చేసిన మాసాలా వడలు వడ్డించారు.
 
ఇక మంగళవారం నుంచి అంచలవారీగా సంఖ్యను పెంచాలని తితిదే నిర్ణయం తీసుకుంది. ఈ మసాలా వడలు పూర్తి స్థాయిలో రథసప్తమి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు, మసాలా వడలు రుచికరంగా ఉన్నాయి. తొలిసారి మసాలా వడలు అందిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి సందర్భంగా మసాలా వడలను పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా చర్యలు తీసుకుంటోంది.