1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. High Tension In Palnadu: Petrol Bombs Seized

పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల కలకలం

bomb attack
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. విప్పర్ల సర్పంచి పదవికి తెదేపా నుంచి రెండు వర్గాల వారు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. నామినేషన్‌ కేంద్రానికి ఇరువర్గాలు ఒకేసారి రావడంతో వారి మధ్య వివాదం మొదలైంది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. పోలీసులు అప్రమత్తమై చెదరగొట్టారు.
 
ప్రత్యర్థి వర్గంపై దాడులకు ఉపయోగించేందుకు కొందరు పెట్రోల్‌ బాంబులను సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో తనిఖీలు చేపట్టారు. పెట్రోల్‌ బాంబులు, లైటర్లు, ఒక కత్తి, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి, నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 
 
ఇరువర్గాల వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పెట్రోల్‌ బాంబులను తహసీల్దార్‌ బండి నిర్మల సమక్షంలో సీజ్‌ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. దీంతో అనేక గ్రామాల్లో ఉద్రికపరిస్థితులు నెలకొన్నాయి.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
స్టార్ షిప్ క్యాచ్ చూస్తుంటే సైన్ ఫిక్షన్ సినిమాలాగే వుంది : సుందర్ పిచాయ్