1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Home education for students from 1st to 8th class in AP

ఏపీలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇంటి నుండే విద్య

Home education
కోవిడ్ 19 నేపథ్యంలో ఇంకా స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉంది. అన్‌లాక్ 4 నిబంధనల ప్రకారం ఏపీ విద్యాశాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. స్కూల్స్ తెరిచేందుకు ఈ చర్యలు తప్పనిసరి. కరోనా మహమ్మారి కారణంగా మార్చ్ నుంచి స్కూల్స్, కళాశాలలు మూతబడ్డాయి. ఈ విద్యా సంవత్సరం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం ఆన్లైన్‌లో క్లాసులు నిర్వహించుకుంటున్నాయి.
 
అటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 మార్గదర్శకాల్లో స్కూల్స్, కళాశాలలు తెరవడంపై స్పష్టమైన సూచనలున్నాయి. దీనిప్రకారం ఏపీలో స్కూల్స్ తెరిచేందకు విద్యాశాఖ కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు మాత్రమే తెరవాల్సి ఉంటుంది. అయితే 50 శాతం వరకు టీచర్లు హాజరుకావచ్చు.
 
అది కూడా ఆన్ లైన్ టీచింగ్, టెలీ కౌన్సిలింగ్ వంటి వాటి నిర్వహణ కోసం. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలి. మాస్క్ తప్పనిసరి. విద్యార్థులు, సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ఎవరికైనా జలుబు, శ్వాసకోసవ్యాధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి.
 
తరగతి గదులు, లేబొరేటరీలు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రధానంగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఇంటి నుంచే విద్యాభ్యాసం కొనసాగించాలి. ఎట్టిపరిస్థితిల్లోను పాఠశాలకు పిలిపించకూడదు. సెప్టెంబరు 21 నుంచి కంటైన్మెంట్ జోన్ వెలుపల ఉన్న స్కూల్స్, కాలేజీల్లో 9 నుంచి 12వ తరగతి పిల్లలను మాత్రమే అనుమతించాలి. వీరికి బోధించే టీచర్లను విద్యార్థుల స్థాయిని బట్టి విభజించాలి.
తర్వాతి కథనం
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు పలువురు నేతలు నివాళి