1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. home sick, inter girl student who has committed suicide

అమ్మానాన్నలు పట్టించుకోవడంలేదు: ఆత్మహత్య చేసుకున్న చైతన్య విద్యార్థిని

home sick
తనను తన తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదనీ, కాలేజీలో చేర్చి తమ పని అయిపోయిందన్నట్లు ప్రవర్తించారన్న మనస్థాపంతో అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్య తొలుత మిస్టరీ అనుకున్నారు. కానీ ఆమె రాసిన సూసైడ్ నోట్ విషయాన్నంతా బయటపెట్టింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అనంతపురం నగరానికి చెందిన లాస్య శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తమ కుమార్తెను డాక్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె తల్లిదండ్రులు బైపీసీలో చేర్పించారు. స్థానిక ఫ్యాకల్టీ సరిగా లేదని ఆమె కృష్ణాజిల్లాలోని కంకిపాడు పోరంకి బ్రాంచ్ శ్రీచైతన్యలో చేరింది.
 
కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో తోటి విద్యార్థునులు తమ ఊళ్లకు వెళ్లిపోతున్నారు. దీనితో ఆమె హాస్టల్లో ఒంటరితనం ఫీలయ్యింది. తన తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని చెప్పింది. వెంటనే తనను ఇంటికి తీసుకువెళ్లాలంటూ ఫోన్ చేసింది. ఐతే ఆమె తండ్రి ఆదివారం వస్తాను అప్పటివరకూ వెయిట్ చేయమని చెప్పాడు.
 
కానీ లాస్య తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదిలావుండగానే కళాశాల నుంచి మీ కుమార్తె ఆరోగ్యం సీరియస్ అంటూ ఫోన్ రావడంతో పేరెంట్స్ హుటాహుటిన విజయవాడకు వచ్చారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయింది. ఆత్మహత్యకు ముందు విద్యార్థిని లాస్యశ్రీ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. హోంసిక్ వల్లే ఆత్మహత్యకు‌ పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఆరుబయట ఆడుకుంటున్న బాలికను టీవి చూద్దామని తీసుకెళ్లి..?