భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ లేఖ.. ట్విట్టర్‌లో వైరల్
భర్తను కోల్పోయిన టీచర్‌కు ఓ స్టూడెంట్ రాసిన లేఖ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, మసాచుసెట్స్‌లోని ఓ పాఠశాలకు చెందిన టీచర్ మెలిసా మిల్నర్ భర్త.. అనారోగ్యం కారణంగా మరణించాడు. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఓ స్టూడెంట్.. తమ టీచర్ అలా బాధగా ఉండటం తట్టుకోలేకపోయాడు. ఆమెను ఓదార్చేందుకు ఒక లెటర్ రాశాడు.
'డియర్ మిసెస్ మిల్నర్.. మీరు మీ భర్తను కోల్పోవడం చాలా బాధాకరం. మీ భర్తను ఇకపై మీరు చూడలేకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ మీ హృదయాలను కలిపే ఒక లైన్ ఉంటుందని గుర్తించండి. ఈ బాధ నుంచి త్వరగా కోలుకోండి' అంటూ ఆ లేఖలో రాశాడు.
అంతేకాదు ఆ లేఖలో ఒక డ్రాయింగ్ కూడా వేశాడు. ఆకాశంలో ఉన్న భర్త కోసం మిల్నర్ చేతులు చాపుతున్నట్లు డ్రాయింగ్ వేసి.. వారి ఇద్దరి హృదయాలను కలుపుతూ ఒక గీత గీశాడు. స్టూడెంట్ రాసిన లేఖతో ఆ టీచర్ ఎంతో ఎమోషనల్ అయింది. తనపై స్టూడెంట్ చూపిన అభిమానాన్ని మిల్నర్ ట్విటర్ ద్వారా పంచుకుంది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.