మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (11:04 IST)

బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు బిడ్డల్ని కిటికీ నుంచి బయటికి తోసివేసిన తల్లి..

Turkey
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్థులో మంటలు వ్యాపించడంతో.. ఆ ఇంట్లో ఉన్న మహిళ తన నలుగురు పిల్లల్ని.. కిటికీ నుంచి బయటకు తోసివేసింది. అగ్నిప్రమాదం నుంచి పిల్లల్ని రక్షించుకునేందుకు ఆ తల్లికి మరో మార్గం చిక్కలేదు. 
 
అయితే ఆ అపార్ట్‌మెంట్ కింద ఉన్న కొందరు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ తన పిల్లలను కిటికి నుంచి కిందకు జారవిడిచింది. 
 
ఫ్లాట్ ఎంట్రెన్స్ వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే తన పిల్లల్ని సురక్షితంగా కిందకు జారవిడిచింది. పిల్లలు, తల్లి అందరూ సురక్షితంగా ఉన్నారు.