శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని బలవన్మరణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పునాదిపాడులోని శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని అనంతపురం జిల్లాకు చెందిన లాస్యశ్రీగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16) అనే యువతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె రాత్రి స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీన్ని గమనించిన సహచర విద్యార్థులు హాస్టల్ వార్డన్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డెన్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... లాస్యశ్రీని పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.